



















kancheepuram:
కాంచీపురం : విష్ణు దేవాలయాలకు , శివుని దేవాలయాలకు బాగా ప్రసిద్ధి . తూర్పు భాగం లో విష్ణు దేవాలయాలు ఉంటాయి , అదే పశ్చిమ భాగం లో శివుని దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి .
విష్ణు దేవాలయాలలో , కొన్ని అతి పెద్ద విగ్రహాలు ఉంటాయి . అవి షుమారుగా 40 నుంచి 50 అడుగుల వరకు ఉంటాయి . చూడగానే ఆహ అనిపించే విధంగా . అతి సుందరంగా , నిజంగానే మనసును ఆకట్టుకునేట్టు , చాలా పద్దతి గా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కూడా . వాటిలో ముఖ్యమైనవి , యోగ నిద్ర స్వామి ( రంగనాయకులు మాదిరి ) అలాగే ఉలగా స్వామి ( ఒక నృత్య భంగిమ అన్నట్టు ) అలాగే కృష్ణ రూపం మాదిరి .. ఇవి అతి పెద్దగా మనకు కనిపించే విగ్రహాలు .
అలాగే కామాక్షి అమ్మవారు , అలాగే ఆది కామాక్షి అమ్మవారు రెండూ కూడా చూపరులను మంత్ర ముగ్దులను చేస్తాయి . అలాగే , చూడగానే అత్యంత శక్తి మంతంగాను మనకు అనుభూతిని మిగులుస్తాయి .
పురాతనమైన ఏకాంబేశ్వర టెంపుల్ , కైలాసగిరి స్వామి వారి దేవాలయాలు మనసుని ఇట్టే లాగేస్తాయి కూడా .
ఇక్కడ మనకు 15 దివ్య దర్శనాలు కనిపిస్తాయి , వైష్ణవ ఆలయాలలో భాగంగా . భారత దేశం మొత్తంలో వున్నా 108 దివ్య దర్శనాలలో , 15 ఇక్కడే ఉన్నాయి .
విష్ణు దేవాలయాలకు , శివుని దేవాలయాలకు మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కూడా అద్భుతంగా ఉంటది .
అలాగే చిత్ర గుప్తుని దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి చెందినది .
ఈ దేవాలయాలను అన్నిటిని రక్షించి , మనకు అందచేయటానికి , మన జ్ఞానాన్ని పెంపొందించటానికి , ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన , కంచి మఠం కూడా ఒక సారి సందరించవలెను .
.
కంచి బాగా సురక్షితమైన ప్రదేశం . టూరిస్ట్ లు విసిట్ చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ బాగానే దొరుకుతాయి . మంచి అనుభూతిని కలిగిస్తాయి కూడా .



















